Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయం పవన్ పెళ్లాలే తేల్చుకుంటారు.. జగన్‌కు ఎందుకు?: ఉండవల్లి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం వందశాతం తప్పని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ''మీట్ ది ప్రె

Webdunia
బుధవారం, 25 జులై 2018 (18:08 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం వందశాతం తప్పని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ''మీట్ ది ప్రెస్''లో ఉండవల్లి మాట్లాడుతూ.. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను వీడియోలో చూడలేదు. కానీ పేపర్లో చూశాను. ఇది చాలా తప్పన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు జగన్‌కు లేదన్నారు. 
 
పవన్ కల్యాణ్‌కు ఎందరు పెళ్లాలో అన్నది వారే తేల్చుకోవాలన్నారు. ఐపీసీ చాప్టర్ 28 ప్రకారం మరొకరు కామెంట్ చేయకూడదన్నారు. పవన్ కల్యాణ్ అన్న వాడికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారనేది.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలన్నారు. అంతేకానీ మనకు అందులో సంబంధం లేదని ఉండవల్లి చెప్పారు. ఏ పెళ్లాన్నైతే ఇబ్బంది పెట్టారో ఆ పెళ్లాం కోర్టుకు వెళ్లొచ్చు. అంతేకానీ, మనకేమీ కామెంట్ చేసే అధికారం లేదని తెలిపారు. 
 
జగన్ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయాలను కలుషితం చేయడం కిందకే వస్తుందన్నారు. రాజకీయాలకు దానికి సంబంధం లేదన్నారు. వ్యక్తి అలవాట్లు చూసి ఓట్లు వేయరని.. ఆ వ్యక్తి వల్ల ఎంత వరకు మేలనే విషయం చూసి ఓట్లు వేస్తారన్నారు. తాను ఒకరికి దగ్గర.. మరొకరి దూరం కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌‌కుమార్‌ చెప్పారు. మా అమ్మ పోయినప్పుడు ప్రతిపక్ష నేత జగన్ వచ్చి పలకరించారు. 
 
జనసేనాని పవన్ పిలిస్తే వెళ్లాను. సీఎం చంద్రబాబు పిలిస్తే వెళ్లా. ఎవరు పిలిచినా వెళ్తానన్నారు. రాజకీయాల్లోకి వచ్చి జీవితం పాడుచేసుకున్నవాళ్లే ఎక్కువ అని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments