Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.. అల్టిమేటం జారీ చెయ్యాలి!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (12:12 IST)
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్డీఏ సర్కారుకు అల్టిమేటం జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, నరేంద్ర మోడీ కేబినెట్ నుంచి తన పార్టీ మంత్రలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
  
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వైపు రాజకీయంగా వాడీవేడీ చర్చ సాగుతుండగానే, మరోపక్క గుంటూరుకు చెందిన సంజీవరావు అనే యువకుడు ఉద్యమ బాట పట్టాడు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేని ఏపీ, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
 
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే కొంతలో కొంతైనా మేలు జరుగుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంజీవరావు నిన్న గుంటూరులోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను ఎక్కాడు. రాత్రంతా సెల్ టవర్ పైనే ఉన్న సంజీవరావు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే కాని కిందకు దిగనని మొండికేస్తున్నాడు. అతనిని కిందకు దించేందుకు పోలీసులు చేస్తున్న యత్నాలు ఫలించడం లేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments