Webdunia - Bharat's app for daily news and videos

Install App

పప్పు అంటే తప్పేముంది? లోకేష్ కంటే జగన్ చాలా బెటర్...

ప్రస్తుతం ఏపీ మంత్రి నారా లోకేష్ పైన విపక్షాలు వరుసగా వాగ్బాణాలు వదులుతున్నాయి. తాజాగా లోకేష్ పైన రోజా చేసిన వ్యాఖ్యలపైన, ఇంకా సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాల పైన ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. లోకేష్‌ను పప్పు అంటే తప్పేముంది అని ప్రశ్నించారు. అసలు

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (19:24 IST)
ప్రస్తుతం ఏపీ మంత్రి నారా లోకేష్ పైన విపక్షాలు వరుసగా వాగ్బాణాలు వదులుతున్నాయి. తాజాగా లోకేష్ పైన రోజా చేసిన వ్యాఖ్యలపైన, ఇంకా సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాల పైన ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. లోకేష్‌ను పప్పు అంటే తప్పేముంది అని ప్రశ్నించారు. అసలు లోకేష్ భార్య ఏమయినా పొలిటీషియనా... ఆమె చాలా బాగా మాట్లాడింది అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు తెగ పెట్టేశారు కదా. ఆమె లోకేష్ భార్యే కదా. మరి ఆమెను అలా ఈయన్ని ఇలా ఎందుకు అంటున్నారు.
 
బాగా మాట్లాడింది కనుక ఆమెను పొగిడారు. లోకేష్ ఏదో నాలుగైదు తప్పులు మాట్లాడారు. సార్వభౌమాధికారం పలకలేకపోయాడు. చంద్రబాబు కొడుకు కాబట్టి ఆయన తప్పులు మాట్లాడేసరికి పబ్లిక్కయ్యింది. లోకేష్ మీద జగన్ బెటరే. ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుడుగా అనుభవం ఉంది. ఐతే చంద్రబాబు మాత్రం జగన్ మోహన్ రెడ్డిని నీకేం అనుభవం వుంది అని అడుగుతుంటారు. లోకేష్‌కు ఏముందసలు.
 
యూపీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ...  అఖిలేష్ యాదవ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నావ్ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. రాహుల్ గాంధీపై ఎన్నో కామెంట్లు చేశారు. యూపీలో గెలుపు 32 శాతం సోషల్ మీడియా వల్లనే అని తేలింది. అంతెందుకు లోకేష్ మామ బాలయ్య మీద ఎన్ని పోస్టింగులున్నాయి. సెలబ్రిటీ మీద పోస్టింగులు మామూలే. అంతమాత్రాన తెల్లారుజామున పట్టుకెళ్లడమెందుకు..? దాంతో అతడికి ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. అరెస్టు కాకముందు అతడి ఫేస్ బుక్‌ను 70 వేల మంది చూస్తే ఇప్పుడు అది 2 లక్షలు దాటింది. అంత పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు కల్పించారు.
 
ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వారికి మంచివి కావు. అసలు ఇలాంటి పోస్టింగులనుద్దేశించి పెట్టిన సెక్షన్ 66ను కోర్టు కొట్టేసింది. ఎవడైనా ఏ పోస్టింగునైనా చేసుకోవచ్చు. ఐతే స్త్రీని విలాసవంతమైన వస్తువుగా చూపిస్తేనే పట్టుకెళ్తారు. నారో లోకేష్ పైన పోస్టింగు చేసినతడిని కూడా అందుకు పట్టుకెళ్లలేదట. ఎ అని పెద్దగా అడల్ట్ అని రాసినందుకు పట్టుకెళ్లారట... అంటూ ఉండవల్లి చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments