Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరితల ద్రోణి ప్రభావం... మరో రెండు రోజుల పాటు వర్షాలే...

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (09:38 IST)
తూర్పు గాలుల కారణంగా బంగాళాఖాతంపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికితోడు పశ్చిమ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇవి రెండూ తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలపై వ్యాపించడంతో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
కాగా ఈ ద్రోణీ ప్రస్తుతం తమిళనాడు తీరం నుంచి ఒడిశా తీరం వరకూ వ్యాపించిందని, రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. 
 
ఇదిలావుండగా, శనివారం ఆకాశం పూర్తి మేఘావృతమై కనిపించగా, కొన్ని చోట్ల వర్షం పడింది. ఈ అకాల వర్షాలతో చేతికందిన పంట నోటికందే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
 
మరోవైపు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే నాలుగు నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. పగటి పూట కాసేపు ఎండగా అనిపించినా, రాత్రి వచ్చేసరికి తీవ్రమైన చలి వాతావరణం కనిపిస్తోంది. 
 
శనివారం హైదరాబాద్ నగరంలో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, మరో మూడు రోజులు ఇదే విధమైన వాతావరణం ఉంటుందని, ఆపై క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments