Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో టెన్షన్ టెన్షన్ : ఆస్పత్రి నుంచి కరోనా ఖైదీ రోగులు ఎస్కేప్

Webdunia
శనివారం, 25 జులై 2020 (14:05 IST)
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరికి కరోనా పాజిటివ్ ఖైదీ రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా ఉండే జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
ఈ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వీరిని స్థానిక సీసీఆర్ పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, శనివారం తెల్లవారుజామున ఇద్దరు కరోనా పాజిటివ్ ఖైదీలు పత్తాలేకుండా పారిపోయారు. 
 
ఈ విషయాన్ని కోవిడ్ కేర్ సెంటర్ అధికారులు ఏలూరు మూడో పట్టణ పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... పారిపోయిన ఖైదీల కోసం బస్టాండు తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. కరోనా సోకిన ఖైదీలు పారిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments