Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్‌కు వేధింపులు- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. చివరికి?

టీవీ యాంకర్‌కు వేధింపులు తప్పలేదు. వేరొక వ్యక్తితో వివాహం జరిగినా ఆ యాంకర్‌ను ఓ వ్యక్తి వేధించాడు. పెళ్లి చేసుకోమని కార్యాలయానికే వచ్చి ఒత్తిడి చేశాడు. చేసేది లేక ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకు

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (10:39 IST)
టీవీ యాంకర్‌కు వేధింపులు తప్పలేదు. వేరొక వ్యక్తితో వివాహం జరిగినా ఆ యాంకర్‌ను ఓ వ్యక్తి వేధించాడు. పెళ్లి చేసుకోమని కార్యాలయానికే వచ్చి ఒత్తిడి చేశాడు. చేసేది లేక ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ తెలుగు టీవీ చానల్ ఆఫీసుకు వెళ్లి, యాంకర్‌ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవీందర్ (25) అనే యువకుడు వేధించాడు. నువ్వంటే ఇష్టమని చెప్పాడు. అయితే యాంకర్ మాత్రం అతనిని పట్టించుకోలేదు. తనకు పెళ్లైపోయిందని చెప్పింది. అయినా వేధింపులు ఆగలేదు. ఫలితంగా ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే.. టీవీలో సదరు యాంకర్‌ను నిత్యమూ చూస్తుండే రవీందర్, ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో.. కార్యాలయానికి వచ్చి.. ఉద్యోగులందరూ చూస్తుండగానే తన కోరికను చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి రవీందర్‌ను అరెస్ట్ చేశారు. 
 
కాగా, గత నాలుగైదేళ్లుగా రవీందర్‌కు, యాంకర్‌కు పరిచయం ఉంది కానీ.. రవీందర్ మాత్రం ఆమెను వివాహం చేసుకోవాల్సిందిగా 2014 నుంచి వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. యాంకర్ తనకు వివాహమైందని చెప్పినా రవీందర్ పట్టించుకోలేదని.. అతని వద్ద విచారణ జరుపుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments