Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావని, శ్రవణ్‌లది అన్నాచెల్లెళ్ల అనుబంధం.. ప్రదీప్ ఆత్మహత్యకు కారణం ఉరితాడే.. రిపోర్ట్?

బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని ఉస్మానియా వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. అతని చేతికి తగిలిన గాయం కారణంగా అతను మరణించలేదని.. అతని మెడకు వేసుకున్న ఉరి వల్లే ప్రాణాలు కోల్పోయాడని రిపోర

Webdunia
గురువారం, 4 మే 2017 (13:55 IST)
బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని ఉస్మానియా వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. అతని చేతికి తగిలిన గాయం కారణంగా అతను మరణించలేదని.. అతని మెడకు వేసుకున్న ఉరి వల్లే ప్రాణాలు కోల్పోయాడని రిపోర్టులో స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రదీప్ మృతదేహానికి గురువారం పోస్టుమార్టం చేసిన వైద్యులు, తాము గమనించిన ఈ విషయాన్ని పోలీసు అధికారులకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆత్మహత్య ద్వారానే ప్రదీప్ చనిపోయాడని రిపోర్ట్ అందడంతో.. ఈ సూసైడ్‌కు దారితీసిన కారణాలు ఏంటనే విషయమై పోలీసుల దర్యాప్తు సాగుతున్నట్లు తెలిసింది. 
 
ఇదిలా ఉంటే... టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య వెనక రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. భార్య పావని వ్యవహారం నచ్చకనే ప్రదీప్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రదీప్ సతీమణి పావని మాత్రం శ్రవణ్‌తో తనకు సంబంధముందని మాట్లాడటం సిల్లీగా ఉంది, శ్రవణ్‌తో తనకు సంబంధమే ఉంటే, మూడు నెలల నుంచి అతన్ని ఇంట్లో ఉంచేందుకు ప్రదీప్ అంగీకరించేవాడా? అని ఎదురు ప్రశ్న వేసింది. శ్రవణ్ తనకు అన్నయ్య లాంటి వాడని.. అన్నాచెల్లెళ్ల సంబంధానికి వివాహేతర సంబంధం అంటగట్టడం చాలా బాధపెట్టిందని పావని చెప్పింది.
 
ప్రదీప్ ఆ రోజు రాత్రి చిన్న గొడవే జరిగిందని.. మామూలుగా అలిగి వెళ్లిపోయానని.. అతిగా తాగిన మైకంలో క్షణికావేశంతోనే ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చునని... గతంలో ప్రదీప్ ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలకు పోలేదని పావని వెల్లడించింది. శ్రవణ్ కూడా పావనితో తనకు సంబంధం అంటగట్టి మాట్లాడటంపై మనస్తాపం వ్యక్తం చేశాడు. పావని తనకు చెల్లెలు లాంటిదని, ప్రదీప్ తనతో బాగా ఉండేవాడని, ఇద్దరం కలిసి సినిమాలకు, ఇతర చోట్లకు వెళ్లేవారమని, గొడవ జరిగిన రోజు కూడా ప్రదీప్ తనతో బాగానే ఉన్నాడని శ్రవణ్ తెలిపాడు. ఇక ప్రదీప్ తల్లి, సోదరుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments