Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు గవర్నర్‌గా సీహెచ్.విద్యాసాగర్ రావు లేదా మోత్కుపల్లి?

తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా మళ్లీ తెలుగుబిడ్డకే దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దీంతో తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌నేత, మహ

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (08:39 IST)
తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా మళ్లీ తెలుగుబిడ్డకే దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత గవర్నర్ కె.రోశయ్య పదవీకాలం ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దీంతో తమిళనాడు రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌నేత, మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్ రావును నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం ఆదేశాలు జారీచేశారు. తెలుగు నేత డాక్టర్‌ కొణిజేటి రోశయ్యను ఇంటికి పంపినా మరో తెలుగు నేతకే అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. 
 
కాగా ఈ స్థానం పూర్తిస్థాయిలో తెలుగుబిడ్డకే దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీలో రెండు రకాల వాదనలు వినవస్తున్నాయి. ప్రస్తుతానికి విద్యాసాగర్ రావుకు అదనపు బాధ్యతలుగా అప్పగించినప్పటికీ పూర్తిస్థాయి గవర్నర్‌గా ఆయన్నే ఇక్కడకు పంపే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లేనిపక్షంలో తెలంగాణకు చెందిన టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు రాష్ట్ర గవర్నర్‌గా వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 
 
నిజానికి టీడీపీకి గవర్నర్‌ పదవి ఇస్తామని బీజేపీ నేతలు చెప్పారని, దాంతో ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న మోత్కుపల్లి నర్శింహులుకు ఆ పదవిని కట్టబెట్టేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారని గతంలోనే ప్రచారం జరిగింది. ఒకవేళ మోత్కుపల్లికి ఆ పదవి దక్కకుంటే మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్.విద్యాసాగర్ రావును తమిళనాడుకు మార్చే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments