Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా, అభాగ్యులను ఆదుకుంటున్న తిరుమల వేంకటేశ్వరుడు, ఎలా?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (22:22 IST)
క‌రోనా కోవిడ్‌-19 నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్ కార‌ణంగా కొంతమంది ఆహారం దొర‌క్క ఇబ్బందులు ప‌డుతున్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, టిటిడి బోర్డు ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి సూచ‌న‌ల మేర‌కు ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు ద్వారా మార్చి 28వ తేదీ నుండి తిరుప‌తిలో ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించారు. అవ‌స‌ర‌మైతే ఒక పూట‌కు 50 వేల ఆహార‌ పొట్లాలు త‌యారుచేసి పంపిణీ చేసేందుకు టిటిడి సిద్ధమైంది.
 
టిటిడి బోర్డు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుప‌తి జెఈవో పి. బ‌సంత్‌ కుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తొలిరోజు శ‌నివారం 25 వేల పులిహోర పొట్లాల‌ను టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో సిద్ధం చేశారు. 
 
తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద‌గ‌ల క్యాంటీన్‌లో ఈ మేర‌కు ఆహార‌పొట్లాల‌ను రెవెన్యూ, తుడ‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల‌కు అంద‌జేశారు. పొంగ‌ళ్‌, పెరుగ‌న్నం, ట‌మోటా రైస్‌, బిసిబెళా బాత్‌, కిచిడీ త‌దిత‌రాల‌తో కూడిన మెనును రోజుకొక‌టి చొప్పున త‌యారుచేస్తారు. 
 
ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 30 వేల పొట్లాలు, రాత్రి 20 వేల పొట్లాలను త‌యారు చేసేందుకు టిటిడి అధికారులు ప్ర‌ణాళిక రూపొందించారు. రెవెన్యూ, తుడ‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు త‌మ సిబ్బంది సాయంతో తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, రెండో స‌త్రం, తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యం వ‌ద్ద ఆహార పొట్లాల‌ను అవ‌స‌ర‌మైన వారికి అందిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు శ్రీవారి నిధులతో వీటిని పంపిణీ చేయనుంది టిటిడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai pallavi : గంగమ్మను దర్శించుకున్న సాయిపల్లవి.. చెల్లెలతో బీచ్‌లో ఎంజాయ్ చేసింది.. (video)

Ramcharan, Allu arjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments