Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవం క్వారంటైన్ కేంద్రంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి తనిఖీలు

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:03 IST)
కోవిడ్ సోకి క్వారంటైన్ కోసం వచ్చే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.
 
టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకోసం ఏర్పాటు చేసిన మాధవం క్వారంటైన్ సెంటర్‌ను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఆమె తనిఖీ చేశారు. ఇక్కడ సిద్ధం చేసిన బెడ్లు, మందులు, పారిశుధ్యం, వైద్యులు, సిబ్బంది అందుబాటు పరిస్థితులను ఆమె పరిశీలించారు. వైద్య సిబ్బందికి అందుబాటులో ఉన్న పిపిఈ కిట్లు, గ్లవుజులు, మాస్కులు, ఫేస్ షీల్డులు పరిశీలించారు.
 
అనంతరం చీఫ్ మెడికల్ ఆఫీసర్, అదనపు ఆరోగ్యాధికారి, నోడల్ ఆఫీసర్ ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవడానికి మందులు, పోషకాహారంతో పాటు యోగా చేయడం కోసం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి ఉద్యోగి మొబైల్ కు మోటివేషన్ వీడియోలు పంపి అవి ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాలన్నారు.

ఈ విధానంలో యోగా తరగతులు చెప్పడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీఎంఓ, అదనపు ఆరోగ్యాధికారి, కోవిడ్ నోడల్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, బర్డ్ నుంచి ఒక డాక్టర్‌తో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు. మాధవంలో అవసరమైన ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. మాధవంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

హోమ్ క్వారంటైన్లో ఉన్న ఉద్యోగులకు కిట్స్ అందించి, వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. తమ విభాగంలో పని చేసే ఉద్యోగులకు కోవిడ్ సోకితే క్వారంటైన్ సెంటర్‌కు పంపడం, వారితో, వారి కుటుంబ సభ్యులతో మాటాడుతూ ధైర్యం నింపాలని  విభాగాధిపతులను ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ లోని వారికి మెనూ ప్రకారం పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నదానం తిరుపతి డిప్యూటి ఈవో శ్రీ లక్ష్మణ నాయక్‌ను ఆదేశించారు.
 
సమీక్షలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ భరత్, బర్డ్ ఇంచార్జ్ ఆర్ఎంఓ శ్రీ శేష శైలేంద్ర, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ ఆనంద రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జెఈవో శ్రీమతి సదా భార్గవి శ్రీనివాసం క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ రోగులకు అందుబాటులో ఉన్న బెడ్లు, ఇతర సదుపాయాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments