టిటీడీ ఈవో బదిలీ

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (09:13 IST)
తిరుమల‌ తిరుపతి దేవస్థానం ఈవో ‘అనిల్‌కుమార్‌ సింఘాల్‌’ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘అనిల్‌కుమార్‌’ స్థానంలో ఇంఛార్జి ఈవోగా ‘ధర్మారెడ్డి’ని నియమించింది.

‘సింఘాల్‌’ను వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ‘జవహర్‌రెడ్డి’ని తిరుమల‌ తిరుపతి దేవస్థానం ఈవోగా నియమిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. టిటీడీ ఈవోగా పనిచేయాల‌ని చాలా కాలం నుంచి ‘జవహర్‌రెడ్డి’ ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈవోగా నియమితులైన ‘అనిల్‌కుమార్‌’ను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈవోగానే కొనసాగించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వ పెద్దల‌ అండ ఉండడంతోనే ఆయన ఆ పోస్టులో కొనసాగారనే మాట అధికార వర్గాల‌ నుంచి వచ్చింది.

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే క్రియాశీల‌క పదవుల్లో ఉన్న ఐఎఎస్‌ అధికారుల‌నందరినీ సాగనంపింది. వారిలో కొందరికి ఏళ్ల తరబడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా అట్టిపెట్టింది. దాదాపు ఏడాదిన్నర తరువాత కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చింది.

టిడిపి హయాంలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారిలో చాలా మందికి ఇదే అనుభవం ఎదురైనా ‘అనిల్‌కుమార్‌’ సింఘాల్‌ మాత్రం టీటీడీ ఈవోగానే కొనసాగారు. బిజెపి పెద్దలు, ముఖ్యులు ఆయన వెనుక ఉండడంతో ఆయనను కదిలించలేదనే అభిప్రాయం ఉంది.

అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ..హఠాత్తుగా ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతానికి ఇన్‌ఛార్జిగా ‘ధర్మారెడ్డి’ని నియమించినా..పూర్తి కాల‌పు ఈవో ‘జవహర్‌రెడ్డి’ని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poorna: పూర్ణ నటించిన అతీంద్రియ అంశాలతో కూడిన డార్క్ నైట్ రాబోతోంది

Ritu Varma: గోపీచంద్ 33 సినిమాలో విల్లు ఎక్కుపెట్టిన సత్యవతిగా రీతువర్మ లుక్

Arya, Vaishnavi: ఆర్య తో వైష్ణవి చైతన్య, నిఖిల విమల్ రొమాన్స్ అదుర్స్

'ఉస్తాద్ భగత్ సింగ్‌'లో కెవ్వు కేక లాంటి స్పెషల్ సాంగ్? : హరీష్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: కాలర్ ఏయ్ ఎత్తరా అంటూ పాటతో అలరించనున్న పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments