Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుంది : తితిదే ఈవో శ్యామల రావు

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (10:30 IST)
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మహిళలతో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రవేశ టిక్కెట్ టోకెన్ల కోసం శ్రీవారి భక్తులు ఒక్కసారిగా తోసుకుని రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తితిదే ఈవో శ్యామల రావు పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులను ఆడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 41మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతుందన్నారు. భద్రతా విధుల్లో ఉన్న డీఎస్సీ ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. అయితే, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ఈ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. 
 
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని, వారితో పాటు మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 
 
డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట : తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు 
అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని, గొడవలు జరుగుతాయని సమాచారం ఉందని ముందుగానే హెచ్చరించానని తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమల వైకుంఠ - ఏకాదశి ద్వార దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ తొత్కిసలాటపై ఆయన స్పందిస్తూ, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాటల్లో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని, జరగరానిది జరిగిందని విచారం వ్యక్తం చేశారు. 'వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత అడ్మిస్ట్రేషన్ లోపం కారణంగా జరిగిందని నాకు అనుమానం ఉంది. ఘటనకు బాధ్యత అధికారులదే కదా. మంగళవారం కూడా నేను అధికారులతో సమావేశమై ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పాను. 
 
గొడవలు జరుగుతాయని నాకు సమాచార ముందని హెచ్చరించాను. ఐదు వేలమంది పోలీసులను పెట్టామని, చూసుకుంటామని అధికారులు చెప్పారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటరులో ఓ మహిళ అస్వస్థతకు గురైన క్రమంలో ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడున్న డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపులాట జరిగింది. అందులో ఆరుగురు చనిపోయినట్టు తెలిసింది' అని బీఆర్ నాయుడు అన్నారు. 
 
డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని, తొక్కిసలాటలో భక్తుల మృతి దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, గాయపడ్డ వారిని చంద్రబాబు పరామర్శించి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందచేస్తారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments