Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి పాలకమండలి సభ్యుడిని తాకిన కరోనావైరస్..!

Webdunia
గురువారం, 2 జులై 2020 (21:35 IST)
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. సామాజిక దూరం, మాస్కులంటూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు చెప్పినా కరోనాని మాత్రం జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. 
 
అయితే టిటిడిపైనే కరోనా పంజా విసురుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు గానీ ఆ ధార్మిక సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కరోనా రావడం పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే తాజాగా టిటిడి పాలకమండలి సభ్యుడు కుమారగురుకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు తేల్చారు.
 
మూడురోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న కుమార గురు పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు ఉదయం రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో కుమారు గురు హోంక్వారంటైన్ లోనే ఉన్నారు. వైద్యులు ఆయనకు ఇంటి వద్దే చికిత్స చేస్తున్నారు.
 
అన్నాడిఎంకే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన. గత కొన్నిరోజుల ముందు డిఎంకే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కూడా కరోనాతో మృతి చెందడం... అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కరోనా రావడంతో రాజకీయ నాయకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మరోవైపు తమిళనాడులో కరోనావైరస్ కేసులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments