Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం .. రాత్రి 8 గంటల వరకే విధులు...

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:58 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందుకోసం పలు రకాలైన ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుని వాటిని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆర్టీసీ సేవలను ప్రజల ముంగింటకు తీసుకెళ్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే డ్యూటీలు వేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మహిళా కండక్టర్లు విధులు నిర్వహించే బస్సులు రాత్రి 8 గంటల లోపు డిపోలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ఈ ఆదేశాలను అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు విధిగా పాటించాలని కోరారు. ఒక వేళ రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ వేయాల్సి వస్తే మాత్రం అందుకు తగిన కారణాన్ని ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలని ఆయనఆదేశించారు. ఈ నిర్ణయంపై టీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments