Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్లాంలో వివాహం అంటే ఓ సివిల్ కాంట్రాక్టు : అసదుద్దీన్ ఓవైసీ

ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇస్లాం మతంలో వివాహం ఓ సివిల్ కాంట్రాక్టుతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు.

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (16:31 IST)
ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇస్లాం మతంలో వివాహం ఓ సివిల్ కాంట్రాక్టుతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో ముస్లిం మహిళలకు ఎలాంటి న్యాయం చేకూరదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ, ఈ విధానంలో భార్యకు విడాకులు ఇవ్వడాన్ని శిక్షించదగ్గ నేరంగా మారుస్తూ, ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ మేరకు బుధవారం సమావేశమై క్యాబినెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం పలుకుతూ, కార్యనిర్వాహక ఉత్తర్వులను వెలువరించింది. 
 
దీనిపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, ముస్లిం మహిళలకు వ్యతిరేకమైన ఆర్డినెన్స్ ఇది అని చెప్పారు. ఇస్లాంలో వివాహం అనేది ఒక సివిల్ కాంట్రాక్ట్ వంటిదని... ఇందులోకి ప్యానెల్ ప్రొవిజన్లను తీసుకురావడం చాలా తప్పని వ్యాఖ్యానించారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని కేవలం ముస్లింలకు మాత్రమే వర్తింపజేయలనుకోవడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments