Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకవన్నె పులి.. నేనూ గిరిజనుడ్నే అంటూ ఇంట్లోకి పిలిచి...

హైదరాబాద్‌లో ఓ మేకవెన్నెపులిలా ఉన్న ఓ మృగాడి నిజస్వరూపం వెలుగుచూసింది. నేనూ గిరిజనుడ్నే.. వర్షంలో తడవద్దు ఇంట్లోకి రండి అని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని ర

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (08:51 IST)
హైదరాబాద్‌లో ఓ మేకవెన్నెపులిలా ఉన్న ఓ మృగాడి నిజస్వరూపం వెలుగుచూసింది. నేనూ గిరిజనుడ్నే.. వర్షంలో తడవద్దు ఇంట్లోకి రండి అని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తిన విషయం తెల్సిందే. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ (48) రాజేంద్రనగర్‌ ఉప్పర్‌ పల్లిలో నివాసం ఉండే తమ కుమారుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో తమకు తెలిసిన వారివద్దకు వెళ్లి వస్తున్న సమయంలో వర్షం ఒక్కసారిగా జోరందుకుంది. దీంతో వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక ఇంటి పక్కన నిల్చుంది.
 
అయితే వర్షం ఆగకపోవడంతో సరైన చోటుకాకపోవడంతో ఆమె తడుస్తూనే ఉంది. దీంతో ఆమె నిల్చున్న ఇంట్లోంచి బయటకు వచ్చిన రాజు నాయక్ (23) అనే యువకుడు ఆమెను గిరజన మహిళగా గుర్తించి, తాను కూడా గిరిజనుడ్నేనని చెబుతూ, వారి భాషలోనే మాట్లాడి, వర్షం తగ్గేవరకూ ఇంట్లో ఉండి వెళ్లాలని నమ్మించాడు. 
 
పైగా, గిరిజన భాషలో మాట్లాడటంతో ఆమె నిజంగానే నమ్మి ఇంట్లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన మేకవన్నెపులి కాసేపటి తన నిజస్వరూపం బయటపెట్టాడు. తర్వాత తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments