Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సున్నా వడ్డీ పంట రుణాల నగదు పంపిణీ

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పథకాలకు డబ్బు జమ చేయనుంది. వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌, సున్నావడ్డీ పంట రుణాల రీయింబర్స్‌మెంట్‌, వైఎస్సార్‌ యంత్రసేవా పథకం లబ్ధిదారులకు డీబీటీ పద్ధతిలో మంగళవారం నగదు జమచేయనున్నారు. ఈ మూడు పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మీట నొక్కి నిధులు విడుదల చేస్తారు. 
 
మంగళగిరిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొంటారు. ఈ ఏడాది రైతు భరోసా పథకంలో రెండో విడతగా 50.37 లక్షల మందికి రూ.2,052 కోట్లు, 2020 ఖరీఫ్‌లో రూ.లక్షలోపు రుణం తీసుకుని, వడ్డీతో సహా ఏడాదిలో చెల్లించిన 6.67 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ కింద రూ.112.7 కోట్లు మంజూరు చేయనున్నారు. 
 
అదేవిధంగా యంత్రసేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు రూ.25.55 కోట్లు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ ప్రభుత్వం వివిధ రకాలైన సంక్షేమ పథకాలకు భారీ మొత్తంలో నగదును జమ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments