Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తొలిసారి.. తిరుపతిలో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు వచ్చేసింది..

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (15:41 IST)
తిరుపతి వాసుల సౌకర్యార్థం డబుల్ డక్కర్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తీసుకురానున్నారు. కాలుష్య నియంత్రణను తగ్గించడానికి, ఎక్కువ శబ్దం చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి డబుల్ డక్కర్ బస్సులను కొనుగోలు చేశారు. ఈ బస్సు ఏయే రూట్లలో నడపాలి అనేది ఇంకా నిర్ణయించలేదు. విద్యుత్తు తీగలకు తగలకుండా డబుల్ టక్కర్ బస్సును నడిపేందుకు వీలుగా రోడ్లు వెడల్పుగా ఉండాలి. 
 
కానీ తిరుపతికి డబుల్ డెక్కర్ బస్సులు నడిపే అవకాశం లేదని అంటున్నారు. ఈ బస్సు శ్రీనివాస సేతు పాలెం మాస్టర్ ప్లాన్ రోడ్లపై మాత్రమే తిరుగుతుంది. తిరుపతి-కాళహస్తి మధ్య ఉన్న టౌన్ బస్సులను తిరుపతి నగరంలోకి మళ్లించడానికి ప్రభుత్వ రవాణా సంస్థ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 
 
తిరుపతి నగర పరిధిలో సాధారణ బస్సులు నడపలేనప్పుడు డబుల్ టక్కర్ బస్సు ఎలా నడపాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో డబుల్ టక్కర్ బస్సును 2-3 రోజుల్లో ఆంధ్ర రవాణా సంస్థకు అప్పగించాలని తిరుమల నగర పాలకవర్గం నిర్ణయించింది.
 
అశోక్ లేలాండ్ అండ్ స్విచ్ కంపెనీ ఈ బస్సును తయారు చేసింది. ఈ బస్సును 2 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు దూరం ప్రయాణించేలా ఈ బస్సును తయారు చేశారు. డబుల్ డెక్కర్ బస్సులో 65 మంది ప్రయాణించేలా వెసులుబాటు కల్పించారు. వచ్చే మంగళవారం తిరుపతి పర్యటనకు రానున్న సీఎం జగన్ చేతులమీదుగా ఈ బస్సును ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments