Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, అందరికీ సర్వదర్సనం టోకెన్లు, ఎప్పట్నుంచి అంటే?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:01 IST)
సర్వదర్సనం టోకెన్లను కేవలం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టిటిడి అందిస్తోంది. గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు టోకెన్ల కోసం కౌంటర్ల వద్దకు చేరుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం అతిథి గృహంలో టోకెన్లను అందిస్తోంది టిటిడి.
 
అయితే చిత్తూరు జిల్లా వాసులకే కాకుండా భక్తులందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు టోకెన్లు ఇచ్చే శ్రీనివాసం వసతి సముదాయాల వద్దకు చేరుకుని ఆందోళనకు కూడా దిగారు. దీంతో టిటిడి ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు.
 
ఈ నేపథ్యంలో టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మరో వారంరోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా సర్వదర్సనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ చెప్పారు. సుపథం దర్సనానికి ఎన్ని టిక్కెట్లు మంజూరు చేస్తున్నారో అంతకు రెట్టింపుగా సర్వదర్సనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు.
 
టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకెన్లు అయిపోయాయని.. భక్తుల ఆందోళనకు దిగడం.. లాఠీఛార్జీ వంటి పరిణామాలు జరగడం బాధాకరమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments