Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండ భక్తులతో కిటకిట - సెలవు దినాలు ముగుస్తుండటంతో...

Webdunia
మంగళవారం, 24 మే 2016 (12:00 IST)
తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తుల పడిగాపులుకాస్తున్నారు. తలనీలాల నుంచి దర్శనం వరకు ప్రతిచోట కూడా భక్తులు పడిగాపులు గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. గదులు దొరక్క రోడ్లపైనే సేదతీరుతున్నారు. గత మూడురోజులుగా ఇదే పరిస్థితి. 
 
సెలవు దినాలు ముగియనున్న కారణంగా భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు వస్తున్నారన్న తితిదే భావిస్తోంది. రోజురోజుకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. మంగళవారం ఉదయానికి సర్వదర్సనం కంపార్టుమెంట్లతో పాటు కాలినడక క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ బయటకు వచ్చేశాయి. చంటిబిడ్డలతో కొంతమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్సనం భక్తులకు 10గంటల్లోను, కాలినడక భక్తులకు 8గంటల్లోను దర్సనం కల్పిస్తామని తితిదే చెబుతోంది.
 
గదులు లభించే సిఆర్‌ఓతో పాటు ఎంబిసి-34, పద్మావతి విచారణ కార్యాలయాల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 85,365మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2కోట్ల 77లక్షల రూపాయలు లభించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments