Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పాప ఖరీదు రూ.10 లక్షలా? మీ ఆర్థిక సాయం మాకు అక్కర్లేదు : బేబీ లక్షిత తాత

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (10:00 IST)
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులి దాడి కేసులో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తమ కుమారుడికి వెంట్రుకలు తీసుకునేందుకు తిరుమలకు నడిచి వెళుతుండగా, చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, మృతురాలి కుటుంబానికి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు రూ.10 లక్షల ఆర్థికసాయం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వీటిపై లక్షిత తాత శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. అసలే బిడ్డను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. మా పాప ప్రాణంఖరీదు రూ.10 లక్షలుగా నిర్ణయించారని, అయినా మాకు ఎవరి సాయం అక్కర్లేదని ఆయన తెల్చి చెప్పారు.
 
తిరుమల కొండలపై జింకలకు ఇచ్చే రక్షణ భక్తులకు లేదన్నారు. జింకలను స్వేచ్ఛగా వదిలితేనే చిరుతలు, పులులు మనుషుల వైపు రావని ఆయన అనారు. జింకలను ఎందుకు బంధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిలు సంచారం ఉన్నట్టు పత్రికల్లో నిరంతరం వార్తలు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. కంచ వేసివుంటే బిడ్డ ప్రాణాలతో ఉండేదని బోరున విలపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ఆయన కోరారు. నాయకులు వస్తే భద్రత కల్పిస్తారని, మాలాంటి సాధారణ భక్తులు మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments