అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఠాగూర్
బుధవారం, 24 సెప్టెంబరు 2025 (19:33 IST)
తిరులమ తిరుపతి దేవస్థానం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టుంది. ఈ వేడుకల్లో భాగంగా, బుధవారం ప్రధాన ఘట్టం ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. 
 
ప్లీజ్... అంకుల్ అని పిలవకండి... బాలయ్య అని మాత్రమే పిలవాలి.. 
 
ప్లీజ్.. అంకుల్ అని పిలవకండి.. నన్ను బాలయ్య అని మాత్రమే పిలవండి అంటూ టీడీపీకి చెందిన యువ ప్రజా ప్రతినిధులకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి వచ్చిన బాలకృష్ణ సందడి చేశారు. మంగళవారం జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శాసనసభ సమావేశాల విరామ సమయంలో బాలకృష్ణ టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అదేసమయంలో తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, బాలకృష్ణను ఉద్దేశించి 'నన్ను ఆశీర్వదించండి అంకుల్' అని కోరారు. దీనికి బాలకృష్ణ వెంటనే నవ్వుతూ.. 'నో అంకుల్.. ఓన్లీ బాలయ్య' అని చమత్కరించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
 
ఈ సరదా సంభాషణ అనంతరం, అక్కడున్న వారు బాలకృష్ణను 'అఖండ-2' సినిమా విడుదల గురించి ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, 'ఈ నెల 25న తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతోంది. ఆ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత మా సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అని బాలకృష్ణ వెల్లడించారు.
 
ఇదేక్రమంలో మంత్రి సంధ్యారాణి అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ప్రచారం కల్పించాలని బాలకృష్ణను కోరారు. ఆమె విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తానికి, తనదైన శైలిలో బాలకృష్ణ చేసిన సందడితో టీడీఎల్పీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments