Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌ టాక్‌పై మోజు.. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం.. భార్యను చంపేసిన భర్త

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (20:53 IST)
గుంటూరు జిల్లాలో మరో అనుమానపు వివాహేతర హత్య జరిగింది. టికి టాక్‌పై మోజుతో పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త.. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ దారుణం జిల్లాలోని పొట్లూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పొట్లూరు గ్రామంలో సువార్తమ్మ, నర్సయ్యగౌడ్ అనే దంపతులు ఉన్నారు. అయితే, సువార్తమ్మకు టిక్ టాక్‌ అంటే పడిచచ్చిపోయేది. దీనిపై ఉన్న మోజులో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం భర్త నర్సయ్య గౌడ్‌లో బలపడింది. 
 
దీంతో భార్యతో తరచూ గొడవకు దిగుతూ వచ్చాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు తార స్థాయికి చేరడంతో వాళ్లిద్దరూ విడిపోయారు. కుమార్తెను తన తల్లిదండ్రుల వద్ద వదిలేసిన సువార్తమ్మ, మహిళా వసతి గృహంలో చేరి, జీవనం సాగిస్తూ వచ్చింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న నర్సయ్య గౌడ్ ఆమెను హతమార్చేందుకు ఓ పన్నాగం పన్నాడు. 
 
పాత గొడవలు మరచిపోయి.. కలిసి కాపురం చేద్దామంటూ నమ్మబలికి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. తాను ముందుగా రచించుకున్న ప్లాన్ మేరకు... తన అన్న వెంకయ్యతో కలిసి భార్య సువార్తమ్మను నర్సయ్య గౌడ్ హతమార్చాడు. అనంతరం, గ్రామ శ్మశానానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నర్సయ్య గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బహిర్గతమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments