Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారి ఆ చిన్నారి బడికెళ్లాడు.. చిదిమేసిన కారు.. ముందు చక్రాల కింద?

తొలిసారిగా ఆ చిన్నారి బడికి వెళ్తున్న వేళ.. అతడిని మృత్యువు వెంటాడింది. పాఠశాల ముందే చిన్నారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్‌లో

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:06 IST)
తొలిసారిగా ఆ చిన్నారి బడికి వెళ్తున్న వేళ.. అతడిని మృత్యువు వెంటాడింది. పాఠశాల ముందే చిన్నారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. హఫీజ్ బాబా నగర్‌లో నివసించే మహబూబ్ అలీ, ముబీన్ బేగం దంపతులకు రహ్మాన్ అలీ అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
రహ్మాన్ అలీని సమీపంలోని నర్సరీలో చేర్పించారు. రంజాన్ పండుగ తర్వాత కుమారుడిని తొలిసారిగా ముబీన్ బేగం బడికి తీసుకు వెళ్లింది. ఇంటి నుంచి ఆటోలో బడివద్దకు వెళ్లి, పాఠశాలలోకి వెళుతుండగా, మాతృశ్రీ కాలనీ నుంచి వేగంగా వచ్చిన కారు రెహ్మాన్‌ను బలంగా ఢీకొంది.
 
ఈ ప్రమాదంలో ముందు చక్రాల కింద నలిగిపోయిన రెహ్మాన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments