Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణ స్నేహితురాళ్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ... ఎందుకో అలా!

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (14:27 IST)
ఈ ముగ్గురు... ప్రాణ స్నేహితులు, దూర‌పు బంధువులు కూడా...  వందన, గంగజల, మల్లిక ఈ ముగ్గురు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి ఒడిగ‌ట్ట‌డం అంద‌రినీ క‌ల‌చివేస్తోంది. తెలంగాణా రాష్ట్రం జగిత్యాలలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది.

 
ఈ ముగ్గురు యువతులు... దగ్గరి బంధువులు. ఒకట్రెండు ఏళ్ల వయసు తేడా ఉన్నా ఒకేచోట పెరిగారు. కలిసి ఆడుకున్నారు..కలిసే చదువుకున్నారు. రెండు నెలల క్రితం వరకూ అంతా సవ్యంగానే సాగింది. ఇటీవలే వారిలో ఇద్దరికి వివాహాలు జరగడంతో పరిస్థితి మారింది. ఒకరికొకరి మధ్య దూరం పెరిగింది. 

 
చాలా రోజుల త‌ర్వాత ముగ్గురు మాట్లాడుకోడానికి చివరిగా చెరువు ద‌గ్గ‌రికి వ‌చ్చారు. అక్క‌డ వారి స్నేహ బంధం శాశ్వతంగా ముగిసిపోయింది. జగిత్యాల జిల్లా కేంద్రం ఈ విషాదానికి వేదికైంది. జగిత్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన ఎక్కలదేవి గంగజల (19), ఎక్కలదేవి వందన (16), గాంధీనగర్‌కు చెందిన ఎక్కలదేవి మల్లిక (19) సమీప బంధువులు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కూడా. వారిలో గంగజల, మల్లికలు ఇంటర్‌ పూర్తి చేశారు. వందన ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 

 
వారిలో గంగజలకు ఆగస్టు 23న జగిత్యాల మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన అత్తెన రాజుతో వివాహమైంది. మల్లిక వివాహం అదే నెల 26న కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన యువతి. ఇలా త‌లో దిక్కు అయిపోయామ‌ని దిగులుపెట్టుకున్నారు ఆ స్నేహితురాళ్లు. ముగ్గురూ ఒక‌చోట క‌లిసి, తీర‌ని వేద‌న‌తో చెరువులో దూకి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. వీరి మృతిపై పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments