Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరి పట్టణంలో దొంగలు.. మహిళ ఉపాధ్యాయురాలు హత్య

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:15 IST)
కదిరి పట్టణంలో వేకువజామునే దొంగలు బీభత్సం సృష్టించారు. ఉదయం రెండు ఇళ్లల్లోకి చొరబడి ఇద్దరు మహిళల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం ఓ మహిళ ఉపాధ్యాయురాలును హత్య చేశారు. మరో మహిళపై దాడి చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో నివాసముండే శంకర్‌ రెడ్డి ఉష దంపతులు భర్త ఉదయం వాకింగ్‌ కోసం వెళ్లిన సమయంలో చోరీకి వచ్చిన దుండగులు ఉషా(45 )పై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 
 
అనంతరం పక్కన ఉండే ఇంటికి ప్రవేశించిన దుండగులు శివమ్మ అనే మహిళ పై దాడి చేసి ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. దొంగలను రాకను గుర్తించి బయటికి రాబోయిన శివమ్మ కుమారుడు కోడలిని గదిలోనే బంధించారు. దాడిలో శివమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఉదయం పని నిమిత్తం ఇంట్లోకి వచ్చిన పని మనిషి చూసి శివమ్మ కుమారుడు కోడలు ఉన్న గది తెరిచింది. అనంతరం బయటకు వచ్చిన వారు శివమ్మను వైద్యం నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments