Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిచ్చగాళ్లకు బ్యాంకు ఖాతాలు... ఏటీఎం కార్డుతో నగదు చోరీ.. ఎలా?

హైదరాబాద్ నగరంలో అనేక మంది బిచ్చగాళ్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు వెలుగుచూసింది. ఈ ఖాతాలకు జారీ అయిన ఏటీఎం కార్డులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ పని చేస్తున్నది ఎవరో కాదు.. సైబర్ నేరగాళ్లు. స

Webdunia
సోమవారం, 31 జులై 2017 (14:11 IST)
హైదరాబాద్ నగరంలో అనేక మంది బిచ్చగాళ్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు వెలుగుచూసింది. ఈ ఖాతాలకు జారీ అయిన ఏటీఎం కార్డులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ పని చేస్తున్నది ఎవరో కాదు.. సైబర్ నేరగాళ్లు. సిటీలోని బిచ్చగాళ్ళకు డబ్బులు ఎరచూపి వారి పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. ఆ తర్వాత ఆ ఖాతాలకు బ్యాంకు ఇచ్చే ఏటీఎం కార్డుతో ఇతర ఖాతాదారుల నగదును దోచుకుంటున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల గుట్టును రాచకొండ సైబర్ క్రైం పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. ఫుట్‌పాత్‌లపై ఉండే వారిని, బిచ్చగాళ్లను సైబర్ క్రిమినల్స్ ఎంచుకుని వారికి రూ.2 వేలు ఆర్థికసహాయం కింద అందిస్తున్నారు. ఆ తర్వాత వారి ఫొటోలను తీసుకుని, ప్రధాన నగరాల్లో ఉండే బస్తీల్లో ఓ గదిని అద్దెకు తీసుకుంటున్నారు. ఆ గది చిరునామాతో బిచ్చగాళ్ల ఫొటోలు పెట్టి బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తున్నారు. ఏటీఎం కార్డు, చెక్‌బుక్కులు వచ్చే వరకు ఆ గదిలో ఉండి, అవి చేతికి అందగానే ఖాళీ చేసి వెళ్లిపోతారు. 
 
ఆన్‌లైన్ మోసం చేసిన తర్వాత ఈ బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు కేవలం 15 నిమిషాల్లో వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా డబ్బును డ్రా చేసేస్తున్నారు. పోలీసులకు బ్యాంకు ఖాతా వివరాలు తెలిసినా ఎక్కడా సరైన ఆచూకీ దొరకదు. ఒకవేళ దొరికినా ఆ చిరునామాలో వారు ఉండరు. బ్యాంకు ఖాతా ఫొటోతో గుర్తుపడుదామనుకున్నా ఫొటోలో ఉన్న వ్యక్తులు బిచ్చగాళ్లు కావడంతో ఏమీ చేయలేకపోతున్నట్టు పోలీసులు విచారణలో తేలింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments