ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వం.. మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ : ప్రేక్షక పాత్రలో ఏపీ ఎంపీలు

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (14:02 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం ఎండమావిగామే మారనుంది. కొత్తగా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తేటతెల్లం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, బీహార్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యమని తేలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు శరాఘాతంగా మారనున్నాయి. 
 
ఒకవైపు లోక్‌సభ సాక్షిగా మంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు మాత్రం ప్రేక్షకుల్లా మిన్నకుండిపోయారు. మంత్రి వ్యాఖ్యలను ఏమాత్రం ఖండించడం లేదా... సభలో నిరసన వ్యక్తం చేయడం వంటి చర్యలు చేయకుండా ప్రేక్షకుల్లా సభలో మిన్నకుండి పోవడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

Show comments