Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తున్న అక్కను నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన చెల్లెలు, ఆ తర్వాత?

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (15:46 IST)
వరుసకు చెల్లెలు. దగ్గరి బంధువు. ఇంటికి వచ్చింది. ఆమెను నమ్మింది. ఇంట్లోనే కూర్చోమని చెప్పి తలుపులు గడియపెట్టకుండా స్నానానికి వెళ్ళింది. బట్టలు మొత్తం విప్పి స్నానపు గదిలో స్నానం చేసింది. అయితే ఈ వీడియోలను చెల్లెలు చిత్రీకరించి అక్కనే డబ్బులు డిమాండ్ చేసింది. ఇచ్చిన డబ్బులు సరిపోలేదని.. మరింత కావాలంటూ ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది బాధితురాలు.
 
డబ్బు కోసం ఎంతటిపనైనా చేస్తారనడానికి ఇదొక ఉదాహరణ. గుంటూరు జిల్లా పొన్నూరు ప్రాంతానికి చెందిన లక్ష్మీతిరుపతమ్మ రెండురోజుల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీనివాసరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే లక్ష్మి ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 
 
లక్ష్మితిరుపతమ్మ సమీప బంధువు నాగలక్ష్మి ఆమె ఇంటికి వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ లక్ష్మి తిరుపతమ్మ స్నానం చేసింది. లక్ష్మికి తెలియకుండా మొత్తం స్నానం వీడియోలను చిత్రీకరించింది నాగలక్ష్మి. ఆ తరువాత ఆ వీడియోలను ఆమె బంధువులు సురేష్, సూర్యారెడ్డి, హరీష్, కొంకిపూడి లక్ష్మిలకు చూపించింది. 
 
వీరందరూ కలిసి లక్ష్మి తిరుపతమ్మను డబ్బులు డిమాండ్ చేశారు. మొదట్లో ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది. అయితే మళ్ళీమళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉండటంతో ఆవేదనకు గురైంది. సొంత బంధువులే ఇలా చేయడంతో ఆమె మానసికంగా కృంగిపోయింది. పది నిమిషాల నిడివి గల సెల్ఫీ వీడియో తీసింది. అసలేం జరిగిందన్న విషయాన్ని అందులో చెప్పి ఆత్మహత్య చేసుకుంది.
 
పోలీసులు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం