Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో గంట పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఇంతకీ ఏమైందో తెలుసా?

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:51 IST)
విజయవాడలో దట్టమైన పొగ మంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సిన స్పైస్‌ జెట్‌ పొగమంచు కారణంగా రన్‌వే కనబడకపోవడంతో పాటు అధికారుల నుండి ఎలాంటి సిగ్నల్స్‌ రాకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టింది.

బెంగళూరు నుండి విజయవాడకు వచ్చిన ఆ విమానానికి మంచు కారణంగా ఎటిసి అధికారులు సిగ్నల్స్ ఇవ్వకపోవంతో గంటకు పైగా చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత అప్రమత్తమైన అధికారులు సిగల్‌ ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

శంషాబాద్‌ విమానాశ్రయంలో బుల్లెట్లు
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. అమెరికా వెళ్తున్న దంపతుల బ్యాగులో బుల్లెట్లును అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా గురజాలకు చెందిన దంపతులు బుధవారం ఉదయం అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో లగేజీని స్కానింగ్‌ చేస్తుండగా..అధికారులకు బ్యాగుల్లో బుల్లెట్లు లభించాయి. దీంతో ఆ బుల్లెట్లను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆ దంపతులను పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments