Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కోర్కె తీర్చేందుకు ఆ తల్లి, పక్కింటి బాలికను గదిలోకి తోసేసింది

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (18:43 IST)
కొడుకు తప్పు చేస్తే దండించాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. అంతేకాదు ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పును జరగకుండా చూసుకోవాలని కొడుక్కి మంచి బుద్ధి చెప్పాలి. కానీ ఈ తల్లి మాత్రం కొడుకు కోరిక తీర్చేందుకు ఏకంగా ఒక బాలిక జీవితాన్ని నాశనం చేసింది.
 
గుంటూరు జిల్లా వినుకొండలో నివాసముండే గోపీనాథ్ అనే యువకుడు ఇంటి పక్కనే ఉన్న 9వ తరగతి బాలికపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయితే ఉపయోగం లేకుండా పోయింది.
 
తన కోరికను తల్లికి చెప్పాడు. అలా చేయకూడదు తప్పు అని దండించాల్సిన తల్లి  కొడుకు కోరికను తీర్చేందుకు సిద్ధపడింది. పక్కింటిలో 9వ తరగతి చదువుతున్న బాలికను తన ఇంటికి పిలిపించుకుంది. మాయమాటలు చెప్పింది. కొడుకుని గదిలో వెయిట్ చేయమని చెప్పి యువతికి మాయమాటలు చెప్పి గదిలోకి నెట్టేసింది.
 
ఇంకేముంది ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అంతా అయ్యాక మహాతల్లి బయటకు వచ్చిన బాలికను బెదిరించింది. జరిగిన విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంది. అయితే ఆ బాలిక తిన్నగా వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తల్లీకొడుకులిద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments