Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్ధం కొండపై కోదండరామ విగ్రహ శిరస్సు లభ్యం

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (20:02 IST)
రామతీర్ధం కొండపైన రామకొలనులో కోదండరామ విగ్రహ శిరస్సు లభ్యం అయింది. లోతైన కొలనులో ఉదయం నుండి జరిగిన గాలింపులో శ్రీరాముని తల కనిపించింది.
 
దాంతో భక్తుల హర్షాతిరేకాలతో  శ్రీరామ నామస్మరణతో రామతీర్దం మారుమ్రోగింది. ప్ర‌ఖ్యాతి  గాంచిన రామ‌తీర్దం కొండ‌పై రాముని విగ్ర‌హం ధ్వంసాన్ని నిర‌సిస్తూ..అధికార వైఎస్ఆర్సీపీ మిన‌హా అన్ని పార్టీలు  కొండ‌పైనే ధ‌ర్నాకు దిగాయి.
 
ప్ర‌త్యేకించి హిందూ ధార్మిక సంస్థ‌లైన‌ విశ్వ‌హిందూ ప‌రిష‌త్, భ‌జ‌రంగ్ ద‌ళ్ తో పాటు బీజేపీ,టీడీపీలు సంయ‌క్తంగా ధ‌ర్నాలో పాల్గొన్నాయి.
 
నిన్న అంత‌ర్వేది, నేడు రామ‌తీర్ధం, రేపు మ‌రో దేవాల‌యం ధ్వంసం అంటూ ధార్మిక సంస్థ‌లు జ‌రిగిన ధ్వంసాన్ని వ్య‌తిరేకిస్తూ ధ్వ‌జ‌మెత్తాయి.

ఇదిలా ఉంటే తెగిప‌డిపోయిన రాముని శిర‌స్సు ల‌భ్య‌మ‌వ‌డంతో పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌ర్తించి, పోలీసుల స‌హాకారంతో మ‌ళ్లీ కోవెల‌లో ప్ర‌తిష్టించారు ఆల‌య అర్చ‌కులు. చిన జీయరు స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ శిరస్సు పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments