Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలి.. భూములిస్తాం: సీఎం జగన్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (18:39 IST)
తెలుగు సినిమా ప్రముఖులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలన్నారు.
 
అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని జగన్ చెప్పారు. తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. ఏపీలో జనాభా, థియేటర్లు ఎక్కువ..ఆదాయం కూడా ఎక్కువేనని తెలిపారు. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపితే విశాఖలో స్థలాలు ఇస్తామని చెప్పారు. 
 
జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని జగన్ వెల్లడించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‍లో విశాఖ పోటీ పడగలదన్నారు. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలని కోరారు. టికెట్ రేట్లకు సంబంధించి అందరికీ ఒకే రేట్లు అని చెప్పారు. 
 
ఆన్ లైన్ పద్ధతిలో టికెట్ల విక్రయం ప్రభుత్వానికి మంచిదని అభిప్రాయపడ్డారు. సినిమా చూసే ప్రేక్షకులకు టికెట్ రేట్ల భారం కాకూడదన్నారు. ఐదో షో వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments