Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపోర్టర్ కేశవ్ హత్యపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన డి‌జి‌పి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (11:28 IST)
కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపైన సమగ్ర దర్యాప్తుకు ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ఆదేశించారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌తో పాటు  హత్య తో ప్రమేయం ఉన్న అందరి పైనా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను వెంట‌నే అరెస్టు చేసి , కఠిన చర్యలు తీసుకోవాలని డి‌జి‌పి కార్యాల‌యం నుంచి ఒక నోట్ జిల్లా పోలీస్ అధికారికి వెళ్ళింది.
 
కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక యూట్యూబ్ ఛాన‌ల్ రిపోర్టర్ కేశవ్‌ను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ఈ హ‌త్య చేసింది ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబులే అని పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.
 
నంద్యాలలో ఆదివారం రాత్రి జరిగిన దారుణ హత్యలో విలేఖరి కేశవ్ మృతి చెందాడు. స్క్రూ డ్రైవర్ తో కేశవ్ ను ఎనిమిది చోట్ల దారుణంగా పొడవడంతో, అత‌ను మృతి చెందాడు. మట్కా వ్యవహారంలో సామాజిక మాధ్యమాలలో ఇటీవల ఒక వీడియో వైరల్ కావడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ స‌స్పెండ్ అయ్యాడు. వి5 అనే యూట్యూబ్ ఛాన‌ల్ లో ఈ వీడియో రావడంతో, క‌క్ష పెంచుకున్న ఆ కానిస్టేబుల్, అత‌ని తమ్ముడు కేశ‌వ్ పై పాశ‌విక దాడికి పాల్ప‌డ్డారు. స్క్రూ డ్రైవర్ తో కేశవ్ ను ఎనిమిది చోట్ల పొడవడంతో మృతి చెందాడు.
 
హ‌త్య‌చేసిన కానిస్టేబుల్, అత‌ని త‌మ్ముడు పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని క‌ర్నూలు  జిల్లా ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డి తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్పారు. ఏ ఒక్క జర్నలిస్ట్ కు ఆపద వ‌చ్చినా, తాను సాయం చేస్తాన‌ని భరోసా ఇచ్చారు. అయితే, ఈ హ‌త్య‌కు కారణమైన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాల‌ని జ‌ర్న‌లిస్టు సంఘాలు డిమాండు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments