Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సాగర్‌ను పేల్చేస్తాం... టెర్రరిస్టుల వార్నింగ్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (17:20 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందిస్తూ వస్తున్న నాగార్జన సాగర్ డ్యామ్‌ను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్‌ను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారనీ, అందువల్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. 
 
నాగార్జున సాగర్‌తో పాటు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంది. తెలంగాణలోని ఈ రెండు ప్రదేశాల్లో దాడులు జరగొచ్చని ఐబీ తెలిపింది. వీటితో పాటు ఢిల్లీ సహా 20 రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ పేర్కొంది. 
 
నేపాల్‌లో ఉగ్రదాడి తర్వాత సముద్ర మార్గం నుంచి భారత్‌కు కొందరు ఉగ్రవాదులు వచ్చారని.. మన దేశంలో దాడులు జరిపేందుకు వీరు సిద్ధమయ్యారని.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వీరు గురిపెట్టినట్లు అప్పట్లో ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
 
మరోవైపు ఐబీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే గతంలోనూ నాగార్జనుసాగర్‌కు పలుమార్లు ఉగ్ర హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments