Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణ పనుల కోసం 15 రోజుల్లో టెండర్లు : మంత్రి నారాయణ

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (14:10 IST)
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులకు అమరావతిలో కదలిక ప్రారంభమైంది. 
 
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో పిలిచిన కాంట్రాక్టులను 15 రోజుల్లో రద్దు చేసి కొత్తవి ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. నవంబరు, డిసెంబరు నెలల్లో అన్ని పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు.
 
360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్ , అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం శుభపరిణామమంటూ ఈ సందర్భంగా మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments