Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో కుప్పకూలిన ఆలయం

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (08:30 IST)
నిత్యం భక్తులతో ఉండే ఆంజనేయ ఆలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో విగ్రహం పూర్తిగా దెబ్బతింది. భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేఈబీ కెనాల్ ఆధునీకరణ పనుల్లో భాగంగా వంతెన సెంటర్‌లో కాల్వ పనులు జరుగుతున్నాయి. కాల్వకు ఆనుకునే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. పక్కనే 18 అడుగుల లోతున గోయి తవ్వారు. దీనిని ఎవరూ గమనించలేదు. తాగు నీటి కోసం కేఈబీ కెనాల్‌కు సోమవారం నీటిని విడుదల చేశారు. నీరు ఆలయం కింద చేరి నాని మట్టి కొట్టుకుపోయింది. ఆంజనేయస్వామి ఆలయం కాల్వలోకి కుప్పకూలింది.
 
ఈ ఘటనలో స్వామి విగ్రహం కూడా పూర్తిగా శిధిలమైంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు రాస్తారోకోకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కాంట్రాక్టర్ అంగీకరించడంతో స్థానికులు తమ ఆందోళన విరమించారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments