Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూచీకత్తు రుణాల్లో అగ్రస్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (16:48 IST)
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం 2021-22 పేరిట ఆర్‌బీఐ తాజాగా ఓ నివేదిక వెలువరించింది. అందులో ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? నేరుగా తీసుకున్న అప్పులెన్ని? రుణాలకు పూచీకత్తు ఇచ్చిందెంత? అనే వివరాలను పేర్కొంది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందంటే..?
 
ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలకు పూచీకత్తు ఇవ్వడంలో తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రస్థానంలో ఉన్నాయని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. ‘రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం-2021-22’ పేరుతో ఆర్‌బీఐ వెలువరించిన తాజా నివేదికలో ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? నేరుగా తీసుకున్న అప్పులెన్ని? రుణాలకు పూచీకత్తు ఇచ్చిందెంత? అనే వివరాలను పేర్కొంది.
 
గతేడాది (2021-22) నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రూ.5 లక్షల కోట్ల రుణాలకు పూచీకత్తు ఇచ్చాయి. వీటిలో అత్యధికంగా రూ.1,35,282.50 కోట్లతో తెలంగాణ, రూ.1.17,503.1 కోట్లతో ఏపీ, రూ.91,975 కోట్లతో తమిళనాడు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. రూ.5 లక్షల కోట్లలో ఈ మూడు రాష్ట్రాలవే 68.8 శాతం ఉండటం గమనార్హం.
 
మార్కెట్ల నుంచి మరిన్ని అప్పులు
ప్రభుత్వరంగ సంస్థలు తీసుకునే అప్పులకు పూచీకత్తు ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మార్కెట్ల నుంచి తీసుకునే రుణాలు సైతం విడిగా ఉంటున్నాయి. ఇలా గతేడాది దేశంలోకెల్లా అత్యధికంగా తమిళనాడు రూ.87,000 కోట్లు, మహారాష్ట్ర రూ.68,750 కోట్లు, పశ్చిమబెంగాల్‌ రూ.67,390 కోట్లను తీసుకొని తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఏపీ రూ.46,443 కోట్ల రుణం తీసుకోగా తెలంగాణ రూ.45,716 కోట్లు తీసుకుంది. 
 
అన్ని రాష్ట్రాలు కలిపి 2021-22లో రూ.7.01 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చి బకాయిలకు రూ.2.09 కోట్లు చెల్లించాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఆఖరుకు ఏపీకి ఉన్న మొత్తం అప్పులు రూ.4,42,442 కోట్లకు, తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,66,306 కోట్లకు చేరతాయని రిజర్వుబ్యాంకు నివేదిక తెలిపింది.
 
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో తెలంగాణకు 28.2శాతం, ఏపీకి 33 శాతం అప్పులున్నాయి. అత్యధికంగా పంజాబ్‌కు 47.9శాతం అప్పులున్నట్లు తేలింది.అత్యధికంగా తమిళనాడుకు రూ.7.53 లక్షల కోట్లు, యూపీకి రూ.7.10 లక్షల కోట్లు, మహారాష్ట్రకు రూ.6.80 లక్షల కోట్ల అప్పులున్నాయి. అన్ని రాష్ట్రాలవి కలిపి రూ.76.09 లక్షల కోట్లు దాటాయి. ఇందులో పాత బకాయిలపై వడ్డీల చెల్లింపులకే గతేడాది రూ.17,584.38 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments