Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (11:18 IST)
ఖతార్‍లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టయ్యారు. ముందస్తు అనుమతి లేకుండా అన్యమత ప్రచారం చేసిందుకు వీరిని ఖతార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టూరిస్ట్ వీసాలపై వెళ్లి మత ప్రచారంలో పాల్గొన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. వీరిని రెండు వారాల క్రితం అరెస్టు చేశారు. ఆ తర్వాత విడుదల చేసినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మాత్రం ప్రయాణ ఆంక్షలు అడ్డంకిగా మారాయి. దేశం విడిచి వెళ్లేందుకు ఖతార్ ఇమ్మిగ్రేషన్ విభాగం వీరికి అనుమతులు మంజూరు చేయలేదు. 
 
దోహాలోని తుమమా అనే ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా అన్యమత ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పాస్టర్లు ఉన్నారు. అరెస్టయిన ఫాస్టర్లలో ముగ్గురు పాస్టర్లు సందర్శక వీసాలపై ఖతార్ వచ్చి మత ప్రచారంలో పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఆ తర్వాత రెండు వారాలకు పైగా అదుపులో ఉంచుకుని వదిలిపెట్టారు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చేందుకు ఆ దేశం అనుమతించలేదు. కాగా, ఖతార్‌లో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకునేందుకు బర్వా ప్రాంతంలో ఒక విశాలమైన ప్రత్యేక కాంపౌడ్‌ను కేటాయించారు. అక్కడ ఉన్న చర్చలకు చట్టబద్దమైన గుర్తింపు ఉంది. ఈ చర్చిలలో జరిగే ధార్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి వచ్చే వారికి ఖతార్ ప్రభుత్వం ప్రత్యేకంగా సందర్శకంగా వీసాలను జారీచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments