Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ సింగపూర్‌గా తెలుగు సంతతి యువతి

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:30 IST)
మిస్ సింగపూర్‌గా తెలుగు సంతతికి చెందిన యువతి ఎంపికయ్యారు. ఆమె పేరు నందితా బన్నా. తాజాగా సింగపూర్ సిటీలోని నేషనల్ మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఈమె సత్తా చాటింది. ఏపీలో సంతతికి చెందిన నందిత మిస్ యూనివర్స్ సింగపూర్-2021 అందాల కిరీటం గెలుచుకుంది. ఈ పోటీల్లో ఈమె మొదటి స్థానంలో నిలిచారు. 
 
ప్రస్తుతం నందిత వయసు 21 సంవత్సరాలు. ఆమె సింగపూర్‌లోనే పుట్టి పెరిగింది. ఆమె కుటుంబం పాతికేళ్ల కిందటే సింగపూరులో స్థిరపడింది. నందిత తల్లిదండ్రుల పేర్లు మాధురి, గోవర్ధన్. వారి స్వస్థలం శ్రీకాకుళం. 
 
నందిత ప్రస్తుతం సింగపూర్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సు అభ్యసిస్తోంది. కోడింగ్‌లోనూ అభిరుచి కలిగిన నందితకు స్కేటింగ్, కుకింగ్, డ్యాన్స్ లోనూ ప్రావీణ్యం ఉంది. 
 
ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేస్తున్న నందితకు సామాజిక స్పృహ ఉంది. ఆమె కేర్ కార్నర్ సింగపూర్ అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటీరుగా పనిచేస్తోంది.
 
కాగా సింగపూర్‌లో జాతివివక్ష వంటి అంశాలను ఎత్తి చూపాలని భావిస్తున్నట్లు నందిత వెల్లడించింది. అలాగే, ఈ యేడాది ఇజ్రాయెల్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో నందిత సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments