Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర బాగోలేదని అలిగిన భర్త... బావిలో దూకిన భార్య... మనస్తాపంతో భర్త కూడా...

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (10:11 IST)
ఓ వివాహిత చిన్నపాటి విషయానికే బలవన్మరణానికి పాల్పడింది. దీంతో మనస్తాపం చెందిన భర్త కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన చీమల సాయికిరణ్, ములుగు జిల్లా రాజుపేటకు చెందిన శైలజ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి 10 నెలల పాప ఉంది. మిల్లులో పనిచేసే సాయికిరణ్ బుధవారం పనికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. 
 
ఈ క్రమంలో భోజనం చేసేందుకు కూర్చోగా కూర విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో సాయికిరణ్ అలిగి భోజనం చేయకుండా పనికి వెళ్లిపోయాడు. భర్త చర్యకు మనస్తాపం చెందిన భార్య శైలజ పాపను ఇంటి వద్దే వదిలి గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లి దూకేసింది.
 
అదేసమయంలో అటువైపు నుంచి వస్తున్న పాఠశాల విద్యార్థులు ఆమెను గమనించి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని భర్త సాయికిరణ్‌కు చేరవేశారు. ఆయన ఆగమేఘాల మీద బావి వద్దకు చేరుకున్నాడు. 
 
అప్పటికే బావి వద్దకు చేరుకున్న గ్రామస్థులు శైలజ మృతదేహాన్ని వెలికే తీసే ప్రయత్నాల్లో ఉండగా, భార్య మరణాన్ని తట్టుకోలేని సాయికిరణ్ అకస్మాత్తుగా బావిలో దూకేశాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు అతడిని రక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments