Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతిచేష్టల వల్లే రైళ్లన్నీ ఆగిపోయాయట!.. కరెంట్ తీగ తెగిపోయినా..?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (12:23 IST)
కోతిచేష్టల వల్లే రైళ్లన్నీ ఆగిపోయాయట. నిజమేనండి.. కోతికి కోతి చేష్టలు కాకమరేముంటాయి. ఎక్కడ ఏది కనిపించినా దానిని కలబెట్టి. విడగొట్టి వాసన చూసి అక్కడ నుంచి పరుగులు పెట్టడడమే దాని పని. దీని వలన ఎవరికి ఏ నష్టమొచ్చినా.. కష్టమొచ్చినా దాంతో పని లేదు. విజయవాడ-వరంగల్ మధ్యన ఓ గూడ్స్ పై కోతి చేష్టల కారణంగా రైళ్ళన్నీ ఆగిపోయాయి. ఆ కోతి చేష్టల సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు స్టేషన్లో ఓ గూడ్స్ రైలును క్రాసింగ్ కోసం ఆపారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కిన కోతి అక్కడి నుంచి ఎగురుతూ విద్యుత్ కాంటాక్ట్ వైరును పట్టుకుంది. దాంతో మంటలు చెలరేగి విద్యుత్ తీగ కూడా తెగిపోయింది. దీంతో రైలు ముందుకు కదలడం లేదు. దాంతో రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
 
ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా అల్లాడిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రైళ్లనీ ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఇంత అల్లరి చేసి, విద్యుత్ తీగను తెంపేసినా కోతికి మాత్రం ఏమీ కాలేదు. తీగ తెగగానే దాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments