Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:41 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
 
వేసవి మొదలు కాకముందే.. ప్రతి రోజు 40 నుంచి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో జనాలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే.. జంకుతున్నారు. కాగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
 
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 42.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు అయింది. కాగా వచ్చే మూడు రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్‌ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments