Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని మరదలు గొంతు కోసిన బావ.. ఆపై విద్యుత్ తీగలపై దూకి...

తెలంగాణ రాష్ట్రంలోని ఓ యువకుడు అత్యంత ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదన్న మరదలు గొంతుకోశాడు. ఆ తర్వాత తాను విద్యుత్ తీగలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (10:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఓ యువకుడు అత్యంత ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదన్న మరదలు గొంతుకోశాడు. ఆ తర్వాత తాను విద్యుత్ తీగలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్‌ కాలనీలోని అయ్యప్ప ఆలయం సమీపంలో గాండ్ల ఓదెలు, విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. పదేళ్ల క్రితం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఓదెలు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఇద్దరి కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. చిన్న అమ్మాయి సంధ్యారాణి (19) పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంత్సరం చదువుతోంది. 
 
ఓదెలు సోదరి కుమారుడైన పాల్వంచకు చెందిన గణేష్‌ (22) సంధ్యారాణిని కొద్ది నెలలుగా ప్రేమిస్తున్నాడు. గణపురం మండలంలోని కేటీపీపీలో పని ఉందనే కారణంతో మూడు రోజుల క్రితం భూపాలపల్లికి వచ్చాడు. మేనమామ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంట్లో వాళ్లు పనుల నిమిత్తం సాయంత్రం బయటకు వెళ్లారు. ఆ సమయంలో సంధ్య, గణేష్‌ మాత్రమే ఉన్నారు. మరో మేనమామను సంధ్యారాణి ప్రేమిస్తున్నట్లుగా గణేష్‌ కొద్ది నెలలుగా అనుమానిస్తున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తానూ కోసుకొన్నాడు. పక్క ఇళ్ల వారు అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకునే సరికి అక్కడి నుంచి అతను పారిపోయాడు. పక్కనే ఉన్న రెండంతస్థుల భవనంపై ఎక్కాడు. అనంతరం 11 కేవీ విద్యుత్తు తీగలపై దూకి ఆత్యహత్య చేసుకున్నాడు. సమాచారం పోలీసులకు చేరవేయగా వారు వచ్చి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments