Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కేసీఆర్ కుట్ర : టీకాంగ్రెస్

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (16:15 IST)
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ముసుగులో భారాస నేతలు ఈ గొడవలకు ప్రయత్నం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. 
 
ఈ మేరకు గురువారం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేసింది. ప్రభుత్వ అధికారులు, కలెక్టరుపై దాడిని భారాస స్ పార్టీ సమర్థిస్తోందని ఈ ట్వీట్‌లో విమర్శించింది. రైతులు, మహిళలు, నిరుద్యోగులంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ముసుగువేసి దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని మండిపడింది.
 
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై ఇటీవల లగచర్ల గ్రామంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి బీఆర్ఎస్ నాయకుల పనేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఈ దాడి వెనుక మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ పట్నం నరేందర్ రెడ్డి బయటపెట్టారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments