Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణ దేవరాయరాలు.. మైసూర్ మహారాజ్ తర్వాత కేసీఆరే.. : తితిదే ఈవో ప్రశంసల జల్లు

తన కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు ప్రపంశల వర్షం కురిపించారు. నాడు శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజ్ వంటి వారు మాత్రమే

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (13:17 IST)
తన కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు ప్రపంశల వర్షం కురిపించారు. నాడు శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజ్ వంటి వారు మాత్రమే స్వామి వారికి అత్యంత ఖరీదైన కానుకలు సమర్పించారని, ఆ తర్వాత ఇపుడు కేసీఆర్ అందజేశారని గుర్తుచేశారు. 
 
అంతకుముందు తిరుమల శ్రీవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం, వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు.
 
రూ.5 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65 కిలోల బంగారు కంఠెను స్వామి వారికి సమర్పించారు. అంతకుముందు, రంగనాయకుల మండపంలో తెలంగాణ ప్రభుత్వం స్వామి వారికి బహూకరించనున్న ఈ బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులు ప్రదర్శించారు. వీటిని తన కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ తిలకించి, ఆలయ అధికారులకు అప్పగించారు. 
 
ఈ సందర్భంగా తితిదే ఈవో సాంబశివరావు స్పందిస్తూ గతంలో రాజులు, చక్రవర్తుల వంటి వారు ఖరీదైన కానుకలను శ్రీ వేంకటేశ్వరుడికి సమర్పించారని, నేడు కేసీఆర్ ఆవిధంగా చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తానని నాడు మొక్కుకున్న కేసీఆర్, ఆ మొక్కును ఇపుడు తీర్చుకున్నారు. కేసీఆర్ కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈవో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments