Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కేబినెట్ సమావేశం: బడ్జెట్‌పై ప్రధాన చర్చ

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (12:12 IST)
తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో భాగంగా బడ్జెట్‌పై ప్రధానం చర్చ సాగనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు.

శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన విషయం వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 
 
ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక సమావేశం జరపనున్నారు. జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యి జిల్లాల సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. కాగా నవంబరు అయిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముఖ్యమైనవిగా తెలుస్తోంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments