Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికుంది: కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (15:58 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికి మాత్రమే ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రైతాంగం సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. 
 
మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాదులో కూర్చుని జిల్లాలను సింగపూర్, లండన్ చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రుణమాఫీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. 
 
జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ విమర్శలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
టీఆర్ఎస్లో చేరిన వారిని పవిత్రులు అనడం, బీజేపీలో చేరినవారిని పాపులు అనడం టీఆర్ఎస్ వారికి పరిపాటిగా మారిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా జగ్గారెడ్డి బీజేపీలో చేరడం అదేదో ఘోరమైన విషయంలా టీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments