Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్స్‌గా పొరబడి పురుగుల మందు సేవించారు...

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కూల్‌డ్రింక్స్ అని పొరబడి పురుగుల మందు సేవించారు. దీంతో వారు అపస్మారకస్థితికి చేరుకుని ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లికి సమీపంలోని పిట్టలగూడెంకు చెందిన తుమ్మల భాస్కర్(12), బన్నీ(11) అనే విద్యార్థులు బుధవారం పాఠశాల ముగిశాక ఇంటి పక్కనే ఉన్న పత్తి చేనులోకి ఆడుకోవడానికి వెళ్లారు. 
 
చేనులో కనిపించిన పత్తి మందును తెలియక తాగారు. కొద్దిసేపట్లోనే ఇంటికి వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన చిన్నారులను చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments