Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక రాధ ఇద్దరు కృష్ణులు... తాగిన మత్తులో టెన్త్‌ అబ్బాయిలు ఏం చేశారో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు యువకులు తాగిన మైకంలో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని సజీవదహనమయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (13:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు యువకులు తాగిన మైకంలో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని సజీవదహనమయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జగిత్యాల జిల్లా కేంద్రం విజయపురి కాలనీలో నివసిస్తున్న కూసరి మహేందర్‌, విద్యానగర్‌లో కుందారపు రవితేజ స్నేహితులు. ఇద్దరూ విద్యానగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. మహేందర్‌ ఓసారి ఇల్లు వదిలి హైదరాబాద్‌కు పారిపోయాడు. రవితేజ మత్తు కోసం వుడ్‌ ప్రైమర్‌ను అలవాటు చేసుకోవడంతో తల్లిదండ్రులు అతడికి పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు.
 
ఈ క్రమంలో ఓ అమ్మాయిని మహేందర్‌, రవితేజలు ప్రేమించారు. ఈ ప్రేమ విషయంపై వారిద్దరూ పలుమార్లు గొడవకూడా పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం మహేందర్‌, రవితేజ మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌లో మద్యం సేవించారు. తాగిన మైకంలో ఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం. అది ముదరడంతో ఒకరిపైన మరొకరు పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారి స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో చిక్కుకుని మహేందర్‌ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. 
 
రవితేజను జగిత్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలురిద్దరూ ఒకరిపై మరొకరు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నారా? ఈ ఘటనలో ఎవరైనా మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? లేదంటే.. అమ్మాయిని వేధిస్తున్నారంటూ మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కోణాల్లోనే దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments